వకీల్ సాబ్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ గురించి డైరెక్టర్ వేణు శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ వీరారం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆఖరి చిత్రం అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే, దాని ముందు విడుదల అయినా కాటంరాయుడు మరియు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా ఘోర పరాజయం సాధించాయి,దీనితో పవన్ కళ్యాణ్ నుండి ఒక్క హిట్టు ని కోరుకుంటూ అభిమానులు దాదాపుగా 7 ఏళ్ళు ఎంతో ఓపిక గా ఎదురు చూసారు, అయితే ఇప్పర్తి వరుకు విడుదల అయినా వకీల్ సాబ్ ట్రైలర్ మరియు టీజర్ తో పాటుగా ఆ సినిమాలోని పాటలు కూడా అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటి వరుకు ఈ సినిమా మీద ఫిలిం నగర్ మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం తో ఈసారి కచ్చితంగా హిట్టు కొడతాము అనే నమ్మకం తో అభిమానులు ఉన్నారు.

ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఈ ఇంటర్వూస్ లో ఆయన వకీల్ సాబ్ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతంత వైరల్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకే మేము ఈ ట్రైలర్ తో సినిమా స్టోరీ మొత్తం ని చెప్పే ప్రయత్నం చేసాము, దానికి ఇంత అద్భుతమైన స్పందన వస్తుంది అని మేము కూడా ఊహించలేదు,కేవలం ట్రైలర్ విడుదలకు అభిమానులు సినిమా విడుదల అయినంత హుంగామ చేసారు, థియేటర్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా జనాలు బారులు తీరిన తీరు చూస్తుంటే అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది, ఒక్క పవన్ కళ్యాణ్ వీరాభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో , వకీల్ సాబ్ సినిమా కూడా ఆలా ఉంటుంది, ఎన్ని అంచనాలు పెట్టుకొని అయినా వెళ్ళండి, మీ అంచనాలకు పదింతలు ఎక్కువే సంతృప్తి చెందుతారు కానీ నిరాశ కి మాత్రం గురి అవ్వరు’ అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సందర్భంగా మాట్లాడాడు.

ఇక ఈ ట్రైలర్ పై అభిమానుల నుండి మాత్రమే కాకుండా టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీల నుండి కూడా ప్రశంసల వర్షం కురిసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇటీవల కాలం లో ఒక్క ట్రైలర్ కి సెలబ్రిటీస్ నుండి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు, ఇక ఈ మూవీ ట్రైలర్ కి టాలీవుడ్ నుండి వచ్చిన రెస్పాన్స్ గురించి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు మాట్లాడుతూ ‘ ఈ ట్రైలర్ ని చూసి చాలా మంది టాప్ హీరోలు నాకు కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపారు, వారిలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక్కరు,ట్రైలర్ నాకు ఎంతో బాగా నాచిని అని, చాలా గొప్ప మెసేజ్ ఉన్న సినిమాని మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ ని జోడించి అద్భుతంగా తీశారు అనే అనిపించింది అని ఎన్టీఆర్ గారు అన్నారు’ అంటూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సందర్భంగా తెలిపాడు, మరి భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *