వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణు దేశాయ్ సెన్సషనల్ కామెంట్స్

ఇటీవల విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ ఎంతతి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ సినిమా పై అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారో మొన్న థియేటర్స్ లో ప్రదర్శించిన ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన జనాలను చూసి అర్థం చేసుకోవచ్చు, ఒక్క ట్రైలర్ కి దాదాపుగా మొదటి రోజు సినిమాకి ఎలాంటి హుంగామ అయితే జరుగుతుందో అలాంటి హుంగామ జరిగింది, పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ ని చూసి ఇతర హీరోల అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయి హుంగామ చేసారు అంటే, ఇతర బాషా మీడియా చానెల్స్ వకీల్ సాబ్ ట్రైలర్ కి అభిమానులు చేసిన హుంగామ గురించి ప్రత్యేకమైన కథనాలు రాసేంత రేంజ్ లో హుంగామ చేసారు, దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేకపోయినా ఆయన ఇమేజి ఇసుమంత కూడా తగ్గలేదు అని,ఇక యూట్యూబ్ లో అయితే ఈ ట్రైలర్ ఒక్క సునామి సృష్టించింది అని చెప్పొచ్చు, కేవలం మూడు రోజుల్లో మూడు కోట్ల వ్యూస్ ని మరియు ఒక్క కోటి 20 లక్షల లైక్స్ ని సాధించి టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్కుని సృష్టించింది.

ఇక ఈ మూవీ ట్రైలర్ పై కేవలం అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రమే కాకుండా టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు,వారిలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఒక్కరు, ఇటీవల అభిమానులతో ఆమె జరిపిన లైవ్ వీడియో ఇంటరాక్షన్ లో అభిమానులు వకీల్ సాబ్ ట్రైలర్ గురించి అడగగా , దానికి ఆమె సమాధానం ఇస్తూ ‘ఈండేనే ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సామజిక స్పృహ ఉన్న కథ ని ఎంచుకోడం చాలా ఆనందం గా ఉంది,మనం రోజు టీవీలలో, న్యూస్ పేపర్స్ లో చూస్తూ ఉంటాము, ఆడపిల్లల పై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి, ఇలాంటి సినిమాలు తీస్తే అలా అత్యాచారాలు చేసే వారు మారిపోతారు అని నేను నమ్మను కానీ, ఇలాంటి మెసేజిలు పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద ఇమేజి ఉన్న నటులు చెప్తే కాసేపు అయినా ఆలోచించగలరు’ అంటూ రేణు దేశాయ్ ఈ సందర్భంగా మాట్లాడారు.

ఇక ఏప్రిల్ 9 వ తేదీన విడుదల అవ్వబొయ్యే వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించాలి అని అనుకున్నాడు దిల్ రాజు, ఇందుకోసం ఆయన రెండు కోట్ల రూపాయిలను వెచ్చించి కనివిని ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేద్దాం అనుకున్నాడు, కానీ హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని అక్కడ విధించిన నిబంధలను ప్రకారం బహిరంగ సభలకు , ర్యాలీలకు అనుమతి లేదు కనుక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోడానికి కూడా అనుమతి లేదు అని ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు వకీల్ సాబ్ టీం కి ఉత్తర్వులు జారీ చేసారు, దీనితో దిల్ రాజు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లో కాకుండా శిల్ప కళా వేదిక లేదా హోటల్ నోవొటెల్ వంటి చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేనుదుకు అనుమతిని కోరాడు,అన్ని కుదిరితే ఈ ఈవెంట్ ఏప్రిల్ 4 వ తేదీన హోటల్ నోవొటెల్ లో జరిగే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *