వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపు మూడేళ్లకు పైగా సినిమాలకు దూరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు వకీల్ సాబ్ చిత్రం తో ఏప్రిల్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇక అభిమానుల కోరిక మేరకు ఇటీవల ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 100 థియేటర్స్ లో యూట్యూబ్ కంటే అరగంట ముందుగా థియేటర్స్ లో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే,అసలే ఆకలి మీద అభిమానులు ఈ ట్రైలర్ ని థియేటర్స్ లో చూడడానికి ఏ స్థాయిలో ఎగబడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,కేవలం ట్రైలర్ కి సినిమా విడుదల రోజు ఎలాంటి హుంగామ అయితే చేస్తారో దానికి పదింతలు ఎక్కువ హుంగామ చేసేసరికి థియేటర్స్ యాజమాన్యాలు కూడా వణికిపోయాయి,8 ఏళ్ళ నుండి సరైన హిట్టు లేకపోయినా,మూడేళ్ళ నుండి సినిమాలు లేకపోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోగా, ఇంతకు ముందు తో పోలిస్తే క్రేజ్ డబల్ అయ్యింది అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయారు,ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి పవన్ కళ్యాణ్ కి హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేదు, ఆయన క్రేజ్ శాశ్వతం అని ఇతర హీరోల అభిమానులు కూడా కామెంట్స్ చెయ్యడం విశేషం.

ఇక ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ని చూసి మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఏప్రిల్ మూడవ తేదీన జరగబొయ్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు, కానీ ఏప్రిల్ మూడవ తేదీన హైదరాబాద్ లోని యూసఫ్ గూడా గ్రౌండ్స్ లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం తో ఒక్కసారిగా అభిమానులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు, ఈ ఈవెంట్ కోసం దిల్ రాజు ఏ స్థాయిలో ప్లానింగ్స్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ హీరో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగని విధంగా దిల్ రాజు ఈ ఈవెంట్ ని ప్లాన్ చేద్దాం అనుకున్నాడు, కానీ హైదరాబాద్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో బహిరంగ సభలకు౭ అనుమతి లేదు అని నిరాకరించడం తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక రద్దు అయ్యింది, అయితే షిప్ప కల వేదిక లో కానీ, హోటల్ నోవొటెల్ లో కానీ ప్రీ రిలీజ్ ఏవంటి ని నిర్వ్బహించడానికి దిల్ రాజు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు,దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.

ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పాడడం పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘ హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ని ఏప్రిల్ మూడవ తేదీన జరగబొయ్యే హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు మాకు అనుమతిని లభించలేదు,అందుకే మేము అనుకున్న తేదికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెయ్యలేకపోతున్నాము,వేరే చోట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు దిల్ రాజు గారు ప్రయత్నిస్తున్నారు,దానికి సంబంధించిన వివరాలు ఆయనే ప్రకటిస్తారు, కావున అభిమానులు అందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ పెరుగుతన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను, బయటకి వెళ్ళేటప్పుడు మాస్కులను కచ్చితంగా ధరించండి’ అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడాడు, ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ త్వరలో తిరుపతి లో జరగబొయ్యే పార్లమెంట్ ఉప ఎన్నికల కోసం ఏప్రిల్ మూడవ తేదీన త్గిరుపతి లో బహిరంగ సభని నిర్వహించబోతున్నారు, ఆ మరుసటి రోజే ఆయన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *