వకీల్ సాబ్ సినిమా గురించి విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన వకీల్ సాబ్ మేనియా నే కనిపిస్తుంది, దాదాపు మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది సినిమా తర్వాత సరైన హిట్ సినిమా లేకపోవడం తో అభిమానులు ఈసారి రాబొయ్యే వకీల్ సాబ్ సినిమాకి టాక్ వస్తే టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క రికార్డు ని మిగల్చకుండా బ్రేక్ చెయ్యాలి అనే కసి తో ఉన్నారు,వాళ్ళ ఉత్సాహం ని రెత్తమపు చేస్తూ ఫస్ట్ లుక్ దగ్గర నుండి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరుకు ప్రతి ఒక్కటి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో ఈసారి కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాము అనే నమ్మకం తో ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు,ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క సెంటర్ లో చిన్నగా ఓపెన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసింది, అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచిన ప్రతి ఒక్క చోట అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది వకీల్ సాబ్ చిత్రం.

ఇది ఇలా ఉండగా ఇటీవల కాలం లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ హైదరాబాద్ లో ఆసియన్ సినిమాస్ తో కలిసి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ లు ఓపెన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు గచ్చిబౌలి లో ఏఎంబీ సినిమాస్ ని ప్రారంబించి విజయవంతంగా నడిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ థియేటర్ కి హైదేరాబద్ లో ఉన్న క్రేజ్ వేరు,ఇప్పుడు అదే ఆసియన్ సినిమాస్ వాళ్ళు విజయ్ దేవరకొండ తో కలిసి ఏవీడీ సినిమాస్ అనే నూతన మల్టీప్లెక్స్ ని నిర్మించారు, ఈ మల్టీప్లెక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా తో ప్రారంభం కానుంది, ఆ మల్టీప్లెక్స్ ని మీరు క్రింది ఫొటోలో ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, ఇక ఆసియన్ సినిమాస్ వారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లోని అమీర్ పెట్ లో ఒక్క మల్టీప్లెక్స్ ని నీంరిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్కప్పుడు సత్యం థియేటర్ ఇక్కడ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ థియేటర్ ని కూల్చేసి ఈ భారీ మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు, ఇప్పటికే 90 శాతం పూర్తి అయినా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం ఈ ఏడాది లోనే పూర్తి అవ్వనుంది.

ఇక వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి దిల్ రాజు వరుకు ప్రతి ఒక్కరి స్పీచ్ అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది, ముఖ్యంగా బండ్ల గణేష్ స్పీచ్ అయితే అభిమానులకు రోమాలు నిక్కపొడుక్కుకునేలా చేసాయి, బండ్ల గణేష్ సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై తన అభిమానం ఎలాంటిదో చెప్పకనే చెప్తూ ఉంటాడు, నిన్న కూడా ఆయన లోని అభిమానం కట్టలు తెంచుకుంది అనే చెప్పాలి, ఆయన స్పీచ్ అంటే సోషల్ మీడియా లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉన్న విష్యం వాస్తవమే , ఇప్పుడు ఎక్కడ చూసిన బండ్ల గణేష్ నిన్న మాట్లాడిన స్పీచ్ తెగ ట్రెండ్ అవుతూ కనిపిస్తుంది, ఇక భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *