వకీల్ సాబ్ సినిమా పై సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ అభిమానుల మూడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ కి మరో మూడు రోజుల్లో తెరపడనుంది,అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయినా పవన్ కళ్యాణ్ మల్లి సినిమాలు చేస్తాడా చెయ్యడం అనే డైలమా లో ఉన్న ఫాన్స్ కి వీబోలీవుడ్ లో సూపర్ హిట్ అయినా అమితాబ్ బచ్చన్ పింక్ సినిమా కి రీమేక్ గా వకీల్ సాబ్ అనే సినిమా ద్వారా ఈ ఈనెల 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు,గత ఏడాదే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడి ఈ ఏడాది ఏప్రిల్ 9 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,తొలుత పెద్దగా ఈ సినిమా పైన అంచనాలు లేకపోయినా కూడా ఫస్ట్ లుక్ నుండి టీజర్ మరియు ట్రైలర్ వరుకు అందరిలో ఆసక్తిని కలగచెయ్యడం తో విడుదల దగ్గర పడే సమయానికి అంచనాలు ఆకాశానికి అంటాయి.

ఇది ఇలా ఉండగా ఈ పింక్ సినిమాని తమిళ్ లో పవన్ కళ్యాణ్ స్థాయి ఇమేజి ఉన్న హీరో అజిత్ రీమేక్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా అక్కడ మంచి విజయమే సాధించింది, తమిళ్ లో అజిత్ వంటి హీరో చేసిన తర్వాతనే తెలుగులో నాకు పవన్ కళ్యాణ్ గారితో చెయ్యాలి అని అనిపించింది అని నిర్మాత దిల్ రాజు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తెలిపాడు, ఇది ఇలా ఉండగా తమిళం లో అజిత్ చేసిన పింక్ అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంతో ఇష్టం అట,ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో రజినీకాంత్ ఈ విషయం ని తెలిపాడు, ఈమధ్య వచ్చిన సినిమాలలో నాకు గుండెకు హత్తుకునేలా చేసిన సినిమా అజిత్ నటించిన నెర్కొండ పర్వయి చిత్రం, ఒక్క సరికొత్త సబ్జెక్టు తో అందరిని ఆలోచింపచేసేలా చేసిన ఈ చిత్రం తనకి బాగా నచ్చింది అని, దీని మాతృక హిందీ కూడా చాలా సార్లు చూసాను అని, ఇప్పుడు తెలుగు లో ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అని తెలిసింది, ఈ సబ్జెక్టు అన్ని బాషలలో రీమేక్ అవ్వడం అవసరం అంటూ రజినీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడాడు అట.

ఇక వకీల్ సాబ్ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల ఓపెన్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట టికెట్స్ అన్ని హాట్ కేక్స్ లా అమ్ముడుపొయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల కనక వర్షం కురిపించింది ఈ చిత్రం, హైదరాబాద్ లో తెరిచినా 270 షోస్ కి గాను 250 కి పైగా షోస్ హౌసేఫుల్ అయ్యి దాదాపుగా ఎండు కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త రికార్డు ని సృష్టించింది ఈ చిత్రం, ఒక్క పక్క కరోనా కేసులు ముంచుకువస్తున్న కూడా థియేటర్స్ లో వకీల్ సాబ్ సినిమాని చూడడానికి జనాలు బారులు తీరడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం వాళ్ళు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్హం చేసుకోవచ్చు, మరి భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న వకీల్ సాబ్ చిత్రం ఏప్రిల్ 9 వ తేదీన ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *