వైల్డ్ డాగ్ చిత్రం కలెక్షన్స్ పై నాగార్జున సెన్సషనల్ కామెంట్స్

మన టాలీవుడ్ లో స్టోరీలు బాగాలేక బుక్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచినా సినిమాలను ఎన్నో చూసి ఉంటాము, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఇలా అన్ని బాగా ఉన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలిచినా సినిమాలు మన టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి,ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం సరైన రీచ్ లేక అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, అలా స్టోరీ స్క్రీన్ ప్లే, దర్సకత్వం అన్ని బాగా ఉన్న కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు పరంగా డిజాస్టర్ గా నిలిచినా చిత్రాలలో ఒక్కటి అక్కినేని నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ అనే సినిమా, ఈ సినిమా ఏప్రిల్ 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే,విడుదల అయినా తోలి ఆట నుండే మంచి టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రానికి ప్రముఖ సైట్స్ అన్ని మంచి రేటింగ్ ఇచ్చిన కూడా కలెక్షన్లను రాబట్టడం లో ఘోరంగా విఫలం అయ్యింది , అసలు ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసింది, ఎందుకు వసూళ్లను రాబట్టడం లో ఈ సినిమా విఫలం అయ్యింది అనే వాటి పై ఇప్పుడు పూర్తిగా విశ్లేషణ చేద్దాము.

తొలి రోజు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం ఒక్క కోటి 20 లక్షల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది,ఇది నాగార్జున వంటి హీరో కి అతి దారుణమైన కలెక్షన్స్ అని చెప్పొచ్చు, ఇక రెండవ రోజు మూడు రోజు అయితే షేర్ సంగతి దేవుడెరుగు, కొన్ని ప్రాంతాలలో అయితే కనీసం గ్రాస్ కూడా రాకపోకవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది, ఇంకో విషయం ఏమిటి అంటే మన తెలుగు లో అసలు అంచనాలే లేని తమిళ హీరో కార్తీ సినిమా సుల్తాన్ మొదటి రోజు వసూళ్లు నాగార్జున వైల్డ్ డాగ్ కంటే ఎక్కువ ఉండడం విశేషం,అసలు వైల్డ్ డాగ్ ఎందుకు ఇంతలా బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడింది అని ఆరాలు తీస్తే, ఈ సినిమా కమర్షియల్ సినిమా కాకపోవడం, దానికి తోడు అసలు పబ్లిసిటీ పరంగా మూవీ టీం పెద్దగా పట్టించుకోకపోవడం వాళ్ళ జనాలకు అసలు ఈ సినిమా విడుదల అవుతుంది అనే విషయమే తెలియకుండా పోయింది,ఇక ఈ సినిమాకి అసలు కలెక్షన్స్ రాకపోవడానికి మరో కారణం టైటిల్, వైల్డ్ డాగ్ అనే టైటిల్ సినిమా పై చాలా తీవ్రమైన ఎఫెక్ట్ చూపించింది అనే చెప్పాలి.

అక్కినేని నాగార్జున తొలి నుండి ప్రయోగాలకు పెట్టింది పేరు, కేవలం కమర్షియల్ సినిమాలకు మాత్రమే ఆయన పరిమితం కాకుండా కొత్త రకం కథలకు పచ్చ జెండా ఊపుతూ కెరీర్ ప్రారంభం నుండి ఎంతో మంది టెక్నిషన్స్ ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి పరిచయం చేసిన గొప్ప హీరో ఆయన, మన టాలీవుడ్ లో 1990 వ సంవత్సరం నుండే పాన్ ఇండియన్ లెవెల్ లో సినిమాలు చేస్తూ చక్రం తిప్పిన ఏకైక నటుడు అక్కినేని నాగార్జున,నేటితరం హీరోలకు కూడా ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడం లో నాగార్జున ఒక్క రోల్ మోడల్ అని చెప్పొచ్చు, ఈ తరం హీరోలు ప్రయోగాత్మక చిత్రాలు చేసి విఫలం అయ్యారు, కానీ నాగార్జున ఒక్కడే ప్రయోగాత్మక చిత్రాలతో ఒక్క నూతన ఒరవడిని సృష్టించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు, అలాంటి సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న నాగార్జున మార్కెట్ ఇలా డౌన్ అయిపోవడం ఆయన అభిమానులకు జీర్ణించుకోలేని విషయం,ప్రస్తుతం ఆయన తానూ నటించిన సెన్సషనల్ హిట్ సినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమా కి సీక్వెల్ గా వస్తున్నా బంగారు రాజు సినిమాలో నటిస్తున్నాడు, కనీసం ఈ సినిమా తో అయినా నాగార్జున బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన అభిమానులను ఆనందపరుస్తాడో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *