హీరోయిన్ గజాల ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాక్ అవుతారు

అందం మరియు అభినయం కలిగిన హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో చాలా అరుదుగా దొరుకుతుంటారు, వీళ్ళు తమ అందం తో కుర్రకారుల్ని ఎలా అయితే అలరించగలరో, తమ నటనతో ప్రేక్షకులను కూడా అంతే అద్భుతంగా ఆకట్టుకోగలరు, అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒక్కరు గజాల,ఒక్కప్పుడు ఈమె టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు, 2001 వ సంవత్సరం లో జగపతి బాబు హీరో గా వచ్చిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా గజాల, ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది, ఈ సినిమా ఆమెకి రెండవ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు, 100 సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న హీరోయిన్ లా ఇందులో గజాల తన నటనతో అందరిని అఆకట్టుకుంది,స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత గజాల మళ్ళీ టాలీవుడ్ లో ఫంవెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు,టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరి తో కలిసి దాదాపుగా 30 సినిమాలకు పైగా నటించిన గజాల గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎక్సక్లూసివ్ గా కొన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

ఇక గజాల వ్యక్తిగత వీసీహాయానికి వస్తే సినిమాల్లోకి రాక ముందు ఈమె అసలు పేరు రాజి, తన సన్నిహితుల సలహా మేరకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన పేరు ని గజాల గా మార్చుకుంది, ఏ ముహూర్తం లో ఆమె పేరు మార్చుకుందో తెలియదు కానీ అప్పటి నుండి ఆమెకి అదృష్టం పదిసం పట్టినట్టు పట్టింది,సినిమాల్లో అవకాశాలు రావడమే కాకుండా కెరీర్ ప్రారంభం లోనే పట్టిందల్లా బంగారం అయ్యింది, ఇక కెరీర్ పీక్స్ టైం లో ఉన్నప్పుడే అప్పట్లో ఆమె ఆత్మహత్యాయత్నం చెయ్యడం పెద్ద దుమారం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే, రాజశేఖర్ హీరో గా నటిస్తున్న భరత సింహ రెడ్డి సినిమా షూటింగ్ సమయం లో గజాల నిద్ర మాత్రలు మింగినట్టు అప్పట్లో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి, కానీ ఆ సినిమా నిర్మాత మాత్రం హోటల్ లో తిన్న ఫుడ్ సరిగా లేకపోవడం వల్లే ఆమె అనారోగ్యం కి గురి అయ్యింది అని, మూడవ రోజే ఆమె పూర్తిగా కోలుకొని షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది అని చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే,ఇక ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అగ్ర హీరోయిన్స్ లో ఒక్కరిగా చలామణి అయినా గజాల 2011 లో విడుదల అయినా మనీ మనీ మరి మనీ అనే సినిమా తర్వాత సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది.

సినిమాలకు పూర్తిగా దూరం అయినా తర్వాత 2016 వ సంవత్సరం లో ఫైసల్ రాజా ఖాన్ అనే ప్రముఖ టెలివిషన్ నటుడుని ప్రేమించి వివాహం చేసుకుంది, సాధారణంగా మీడియా కి ఎప్పుడు దూరంగా ఉండే గజాల లేటెస్ట్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది, ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు, కెరీర్ ప్రారంభం లో ఆమె ఎంత అందం గా ఉండిందో, ఇప్పుడు కూడా అంతే అందం గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది,ఎంత అందంగా అంటే ఆమెతో ఇప్పటికి కూడా హీరోయిన్ గా దర్సక నిర్మాతలు సినిమాలు తీసేయొచ్చు, అంతలా ఆమె తయారు అయ్యింది,సాధారణంగా చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత వాళ్ళ ముఖాలు ఎవ్వరు గుర్తు పట్టలేనంత గా మారిపోతుంది , కానీ గజాల మాత్రం 20 సంవత్సరాల క్రితం ఎంత అందం గా ఉండిందో ఇప్పటికి అంతే అందం గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది, ఆమె తన భర్త తో కలిసి దిగిన ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం.

1

2

3

4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *